జీడిమెట్ల, వెలుగు: పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన జగదీశ్వర్‌రెడ్డి(26) కొన్నేళ్ల క్రితం తల్లిదండ్రులతో కలిసి సూరారం కాలనీకి వచ్చాడు. కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
సుభాష్‌నగర్‌కు చెందిన సోహైల్, అజయ్, బిహార్ కు చెందిన కుందన్‌తో స్నేహం ఏర్పడింది. కొంతకాలంగా జగదీశ్వర్‌రెడ్డి సోహైల్ వ్యక్తిగత జీవితంలో తలదూరుస్తుండటంతో సోహైల్ కు అతని మిత్రుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
దీంతో జగీశ్వర్రెడ్డిని చంపాలని సోహైల్ అజయ్, కుందన్‌తో కలిసి ప్లాన్వేశాడు. ఆదివారం రాత్రి అతన్ని మద్యం తాగేందుకు ఫాక్స్ సాగర్చెరువు వద్దకు పిలిపించారు. మద్యం తాగాక వారి మధ్య మాటామాట పెరిగింది. ఆ ముగ్గురూ కత్తితో జగదీశ్వర్రెడ్డిపై దాడి చేసి హత్య చేశారు. తర్వాత సోహైల్ పోలీసులకు లొంగిపోయాడు. సోహైల్ పై గతంలో పలు కేసులు ఉన్నాయి. అజయ్, కుందన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
