చాక్లెట్ల రూపంలో పటాసులు

చాక్లెట్ల రూపంలో పటాసులు

దీపావళి పండుగ వచ్చేస్తోంది. చిన్నా..పెద్దా ఆహ్లాదంగా జరుపుకునే పండుగ ఇది. ఈ ఫెస్టివల్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది బాణాసంచా. బాంబులు పేల్చి.. చిచ్చు బుడ్లు వెలిగిస్తూ.. సంతోషంగా జరుపుకుంటుంటారు. రంగురంగుల విద్యుద్దీపాల కాంతులతో టపాసులు పోటీ పడుతుంటాయి. స్వీట్ల షాపుల వద్ద విపరీతంగా రష్ ఉంటుంది. రకరకాల స్వీట్లు మార్కెట్ లో లభిస్తుంటాయి. వినియోగదారులను ఆకట్టుకొనేందుకు యజమానులు వినూత్నంగా స్వీట్లు తయారు చేస్తుంటారు.

కాల్చకుండా తినే విధంగా మూర్తీస్ బేకరీ యజమాని విక్రమ్ మూర్తి పటాకులను తయారు చేయించారు. ప్రజలకు అవగాహన కల్పించడానికి వీటిని తయారు చేయించినట్లు విక్రమ్ వెల్లడించారు. లక్ష్మీబాంబు, చిచ్చు బుడ్లు, రాకెట్లు..ఇలా అన్ని రకాల పటాకులను చాకెట్ల రూపంలో ఆకట్టుకుంటున్నాయి. చూస్తూనే నోరురేలా ఉన్న వీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. వీటిని బహుమతుల రూపంలో అందించేందుకు ఇష్టపడుతున్నారంటున్నారు.