తెలుగు వర్సిటీలో మ్యాజిక్ కోర్సు

తెలుగు వర్సిటీలో మ్యాజిక్ కోర్సు

పద్మారావునగర్, వెలుగు: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా ఇన్ మ్యాజిక్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల విద్యార్థులు, ఔత్సాహిక కళాకారులు విశ్వవిద్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకొని, ప్రవేశం పొందవచ్చని పేర్కొంది. కనీస విద్యార్హత పదో తరగతి కాగా,  కోర్సు సాయంత్రం వేళల్లో నాంపల్లి ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాలకు కోర్సు కో-ఆర్డినేటర్ ప్రముఖ మెజిషియన్ సామల వేణును 9059794553, 9246150156 నంబర్లలో సంప్రదించాలని వర్సిటీ రిజిస్టార్ తెలిపారు.