వెంకటేష్ డ్యాన్సులు చూసి ఎంజాయ్ చేస్తారు: తమన్

వెంకటేష్ డ్యాన్సులు చూసి ఎంజాయ్ చేస్తారు: తమన్

వరుస మ్యూజికల్ హిట్స్‌ తో జోష్ మీదున్నాడు తమన్. తన తాజా చిత్రం ‘వెంకీ మామ’ఈనెల 13న విడుదల కానున్న సందర్భంగా తమన్ చెప్పిన విశేషాలు.

రీమిక్స్ సాంగ్స్‌‌కి దూరంగా ఉంటున్నాను. ఆ సంగీత దర్శకుడు, గాయకుడు, గీత రచయిత పాట చెడగొట్టాడని తిట్టుకుంటున్నారు. ఒక్కోసారి బాలుగారు ఫోన్ చేసి మరీ తిడుతున్నారు (నవ్వుతూ). అదో పెద్ద టెన్షన్. భవిష్యత్తులో నా పాట ఎవరైనా రీమిక్స్ చేస్తే నేను కూడా తిట్టుకుంటానేమో. అందుకే ఎవరైనా రీమిక్స్ అడిగినా వద్దని చెపుతున్నాను. ‘వెంకీ మామ’ ఒక ఎమోషనల్ సినిమా. రఫ్ వెర్షన్‌‌ను చూసినప్పుడే కంటతడి పెట్టాను. అంతలా కనెక్టవుతుంది. మామ, అల్లుడు పోటీపడి నటించారు. వెంకటేష్ గారు క్వాలిటీగా ఆలోచిస్తే… చైతు క్వాలిటీగా పర్​ఫామ్​ చేశాడు. బాబీ అంతే క్వాలిటీతో తీశాడు.

అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేసే  కమర్షియల్ హంగులు ఇందులో ఉన్నాయి. మల్టీస్టారర్ అయినప్పటికీ రియల్ లైఫ్ మామ, అల్లుడు అనే రిలేషన్ ఉంది కనుక భయపడలేదు. అయితే ఇద్దరూ తొలిసారి కలిసి చేస్తున్న సినిమా కనుక హిట్టవ్వాలనే ప్రెజర్ ఉంది. ‘ఎన్నాళ్లకో’ అనే పాటలో వెంకటేష్ గారి డ్యాన్సులు చూసి ఎంజాయ్ చేస్తారు. ఆ వీడియ్ సాంగ్‌‌ని  ముందే రిలీజ్ చేయమని సురేష్ బాబు గారికి చెప్పాను. ఎయిటీస్‌‌లో వచ్చిన పాటల్ని ఇప్పుడు రెట్రో సాంగ్స్‌‌గా కంపోజ్ చేయడం చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ‘డిస్కో రాజా’లో కూడా ఒక పాట చేశాను. కానీ రెట్రోని డిజిటల్ అవుట్‌‌పుట్‌‌లో తేవడం చాలా కష్టమైన విషయం.

మంచి కథే మంచి పాటల్ని అందించగలుగుతుంది. నా పాటలకి లభిస్తున్న ఆదరణకి కారణం మంచి స్క్రిప్ట్‌‌లే. డిఫరెంట్ జానర్ సినిమాలు రావడం వల్ల కూడా కొత్త తరహా పాటలొస్తున్నాయి. వరుస సినిమాలున్నప్పటికీ… ముందుగానే ప్లాన్ చేసుకున్నాం కనుక టెన్షన్ లేదు.

లవ్ స్టోరీస్‌‌తో పోల్చితే కమర్షియల్ సినిమాకి మ్యూజిక్ చేయడమే కష్టం. ఉదాహరణకి ఓ హీరో కత్తి పట్టుకుని పొడిచే ఫీల్స్‌‌ని ప్రేక్షకులు నమ్మేలా తీయడం చాలా కష్టం. మాకే కాదు డైరెక్టర్‌‌‌‌తో సహా అందరికీ స్ట్రెయిన్. అందుకే  కమర్షియల్ మూవీ డైరెక్టర్స్‌‌కి రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తారు. నా వరకైతే పని చేస్తూ పోతే రెమ్యూనరేషన్స్ అవే పెరుగుతాయని నమ్ముతాను. ఎవరికి ఎంతివ్వాలో నిర్మాతలకి బాగా తెలుసు. మాకిచ్చే రెమ్యూనరేషన్‌‌లోనే టీమ్ అందరికీ పంచాలి. మిగతా ఏ క్రాఫ్ట్స్‌‌లోనూ ఇలాంటి పరిస్థితి లేదు.

ఒకేసారి ఆడియో విడుదల చేయడం కంటే ఒక్కో పాటనీ రిలీజ్ చేయడమే బాగుంది. దీని ద్వారా సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో తెలుస్తోంది. కొందరు అనుకుంటున్నట్టు సంగీత దర్శకుల మధ్య ఎలాంటి వ్యక్తిగత పోటీలు లేవు. అవన్నీ పబ్లిక్ ప్లాట్ ఫామ్స్‌‌లో ఉన్నవే. నేనైతే నంబర్ రేసులు లాంటివి పట్టించుకోను. రోజూ కొత్తగా నేర్చుకోవాలి. నేర్చుకుని ఆపేయకూడదు.అభిమానులతో రెగ్యులర్​గా ట్విట్టర్‌‌‌‌లో ఇంటరాక్ట్ అవుతుంటాను. వాళ్ల ప్రతి ట్వీట్ నాకొక ప్రెస్‌‌మీట్. అందరి ఫీడ్ బ్యాక్ తీసుకున్నప్పుడే అన్నీ నేర్చుకోగలం. పొగిడే వాళ్లే కాదు, తిట్టేవాళ్లు కూడా కావాలి. తమకేదో భాదనిపిస్తేనే కదా విమర్శించేది! వాళ్లని సంతోషపెట్టాలనే ఆలోచనతోనే కష్టపడి పనిచేస్తాను. ప్రశంసలు, విమర్శలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తాను.