చలికాలంలో హెల్దీ డైట్ ఇదే

చలికాలంలో హెల్దీ డైట్ ఇదే

సీజన్​ మారినప్పుడు ఆహారపు అలవాట్లు, తిండి కూడా మారాలి. ఆయా సీజన్లలో వచ్చే అనారోగ్యాల బారిన పడకుండా ఉండేందుకు, ఇమ్యూనిటీ పెంచుకునేందుకు తిండిలో మార్పులు చాలా అవసరం. బ్యాలెన్స్​డ్​ డైట్​ తింటే సీజనల్​ హెల్త్​ ప్రాబ్లమ్స్​ నుంచి బయటపడొచ్చు. అంతేకాదు  గుండె సమస్యలు, డయాబెటిస్​, క్యాన్సర్​ వంటి క్రానిక్​ డిసీజ్​లు రాకుండా జాగ్రత్తపడొచ్చు అంటోంది క్లినికల్​ డైటీషియన్​ శ్వేతా మహదిక్​.

ఆమె చెబుతున్న హెల్దీడైట్​ ఇది...

మెటబాలిజం సరిగా జరగాలంటే ప్రొటీన్​ కావాలి. పాలు, పప్పులు, సోయాబీన్స్​, గుడ్డు తెల్లసొన, చికెన్​తో పాటు చేపలు రెగ్యులర్​గా తింటే శరీరానికి కావాల్సినంత ప్రొటీన్​ దొరుకుతుంది.   చలికాలంలో ఫైబర్​ ఎక్కువ ఉండే ఫుడ్​ తినాలి. పండ్లు, ఆకుకూరలు, ఓట్స్​, బ్రౌన్​ రైస్​, సజ్జలు, జొన్నలు వంటివి డైట్​లో ఉండాలి.
 ఒమెగా–3–ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆయిలీ ఫిష్​ సాల్మన్​ చేపలు, వాల్​నట్స్​, బాదం, అవిసె గింజలు తినాలి. దాంతో వంట్లో ఉండే చెడు కొలెస్ట్రాల్​ తగ్గుతుంది. 
శరీరానికి అవసరమైన పోషకాల్లో ఫ్యాట్​ ఒకటి. అయితే, శాచ్యురేటెడ్​ ఫ్యాట్​ ఉండే కేకులు, పేస్ట్రీలు, ప్రాసెస్డ్​ మీట్​ వంటివి​ తినొద్దు. అన్​శాచ్యురేటెడ్​ ఫ్యాట్​ ఉండే పీనట్​ బటర్, అవకాడో, ఆలివ్​ ఆయిల్​వంటివి ఆరోగ్యాన్ని పెంచుతాయి. వేగించిన ఫుడ్​ ​ బదులు... ఉడికించిన, ఆవిరి మీద వండినవి తింటే మంచిది.