మార్కెటింగ్‌‌‌‌ క్యాంపెయిన్‌‌‌‌కు శ్రీకారం చుట్టిన ముత్తూట్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌

మార్కెటింగ్‌‌‌‌ క్యాంపెయిన్‌‌‌‌కు శ్రీకారం చుట్టిన ముత్తూట్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: గోల్డ్‌‌‌‌లోన్‌‌‌‌ ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీ కంపెనీ ముత్తూట్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌ అతి పెద్ద  మార్కెటింగ్‌‌‌‌ క్యాంపెయిన్‌‌‌‌కు శ్రీకారం చుట్టింది. ఈ క్యాంపెయిన్‌‌‌‌లో కొత్త మస్కట్‌‌‌‌గా గోల్డ్‌‌‌‌మెన్‌‌‌‌  కనిపించనున్నారు.  ‘పుట్‌‌‌‌ యువర్‌‌‌‌ గోల్డ్‌‌‌‌ టు వర్క్‌‌‌‌’ (మీ బంగారాన్ని సద్వినియోగం చేసుకోండి) అనే సందేశాన్ని ప్రచారం చేయనున్నారు. ఈ అడ్వర్టయిజింగ్ క్యాంపెయిన్‌‌‌‌ను  మైత్రి ఎడ్వర్టయిజింగ్‌‌‌‌ వర్క్స్‌‌‌‌ రూపొందించింది.  కొత్త క్యాంపెయిన్  ద్వారా ఇంటిలోని నిష్ప్రయోజనంగా ఉన్న బంగారాన్ని ఎలా వాడుకోవాలో ముత్తూట్ వివరించనుంది.  ఏ టైమ్‌‌‌‌లో నైనా  గోల్డ్ లోన్స్  ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో తెలుపుతుంది.  ఈ ప్రచారాన్ని కామెడీ యాంగెల్‌‌‌‌లో  రూపొందించారు. ఈ క్యాంపెయిన్‌‌‌‌లో హాస్యనటులు  జానీ ఆంటోనీ, బ్రహ్మానందం, సాధు కోకిల, రెడిన్‌‌‌‌ కింగ్ల్సే లు నటించారు. 

వీరు మలయాళం, తెలుగు, కన్నడ, తమిళ భాషలలో కనిపించనున్నారు.  గోల్డ్ లోన్లతో  ప్రజల ఆర్థిక అవసరాలు ఎలా తీరగలవో,  ఇతర లోన్లతో పోలిస్తే గోల్డ్‌‌‌‌ లోన్లు పొందడం ఎంత సౌకర్యవంతమో ఈ యాడ్ క్యాంపెయిన్ ద్వారా ముత్తూట్ ఫైనాన్స్ వివరిస్తుంది. టీవీ, ప్రింట్‌‌‌‌, రేడియో, కేబుల్‌‌‌‌ టీవీ, మ్యాగజైన్స్‌‌‌‌, థియేటర్‌‌‌‌, మల్టీప్లెక్స్‌‌‌‌, ఓఓహెచ్‌‌‌‌, బీటీఎల్‌‌‌‌, ఆన్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌ యాక్టివేషన్స్‌‌‌‌, ఓటీటీ, యూట్యూబ్‌‌‌‌, సోషల్‌‌‌‌ మీడియా,  ఇతర డిజిటల్‌‌‌‌  మీడియా ద్వారా యాడ్స్​ను ప్రచారం చేస్తారు. ప్రస్తుతం ముత్తూట్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌ వివిధ రకాల గోల్డ్ లోన్లను ఆఫర్ చేస్తోంది. సరసమైన వడ్డీరేట్లు, వేగవంతమైన, అతి సులభమైన డాక్యుమెంటేషన్‌‌‌‌, ఎలాంటి ప్రాసెసింగ్‌‌‌‌ ఫీజు వసూలు చేయకపోవడం, తక్షణ లోన్‌‌‌‌ డిస్బర్సల్‌‌‌‌, ఐ ముత్తూట్‌‌‌‌ మొబైల్‌‌‌‌ యాప్‌‌‌‌పై 24 గంటల ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ చెల్లింపు సదుపాయం, ఓవర్‌‌‌‌డ్రాఫ్ట్‌‌‌‌ సదుపాయం , 24 క్యారెట్‌‌‌‌ గోల్డ్‌‌‌‌ మిల్లీగ్రామ్‌‌‌‌ రివార్డు పాయింట్లు, లోన్‌‌‌‌ ఎట్‌‌‌‌ హోమ్‌‌‌‌ సేవలు వంటి సర్వీస్‌‌‌‌లను కంపెనీ ఆఫర్ చేస్తోంది.