మై హోమ్ భూజా అపార్టీమెంట్పై నుంచి దూకి వ్యక్తి సూసైడ్

మై హోమ్ భూజా అపార్టీమెంట్పై నుంచి దూకి వ్యక్తి సూసైడ్

హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మై హోమ్ భూజ అపార్ట్ మెంట్పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన విష్ణు(43) డీ బ్లాక్ లో 1401 ప్లాట్ లో నివాసం ఉంటున్నాడు.

ఏం జరిగిందో ఏమోగాని ఈరోజు(అక్టోబర్ 17) అపార్ట్ మెంట్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.