
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సిద్దమవుతుంది. రాబోయే మూడు లేదా నాలుగు రోజుల్లో ఫస్ట్ లిస్ట్ ప్రకటించే అవకాశం ఉంది. 60మందితో కూడిన తొలి జాబితాను బీజేపీ ప్రకటించనుందని తెలుస్తోంది. ఈ క్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రకటించే తొలి జాబితాలో తన పేరు కచ్చితంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం తనకు మద్దతుగా ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా గతంలో లాగే తనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయనున్నారని చెప్పారు.
ALSO READ : వీకే సక్సేనా కీలక నిర్ణయం.. కశ్మీర్ వలస కుటుంబాలకు రిలీఫ్ పెంపు
తాను స్ఫస్పెన్షన్ లో ఉన్నప్పుడు తనకు అండగా నిలిచిన గోషామహల్ నియోజకవర్గ కార్యకర్తలకు , ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు రాజాసింగ్. గోషామహల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేక బయటి నుండి తెచ్చుకున్నారని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇంకా దొరకడం లేదని విమర్శించారు. గతంలో కంటే ఈసారి రెట్టింపు మెజారిటీతో గోషామహల్ నుండి గెలువబోతున్నట్లుగా జోస్యం చెప్పారు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్న రాజాసింగ్.. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.