నా పెళ్లాం ఊరెళ్లింది.. నేను చాలా హ్యాపీ : ఆటోడ్రైవర్ టాలెంట్

నా పెళ్లాం ఊరెళ్లింది.. నేను చాలా హ్యాపీ : ఆటోడ్రైవర్ టాలెంట్

భర్తలో సగభాగం భార్య. జీవితాంతం భర్త కష్టసుఖాల్లో తోడుగా ఉండి బరువు బాధ్యతల్లో భాగం పంచుకునే భాగస్వామి భార్య. ఇది ఒకప్పటి ముచ్చట.. ఇప్పుడంతా.. భార్య బాధితుల మగాళ్లు. ‘భార్య కొట్టిందని ఇంటి నుంచి వెళ్లిపోయిన భర్త’, ‘భార్య వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న భర్త’, ‘భార్య కొట్టి చంపేస్తోంది, కాపాడండి బాబూ అంటూ పోలీసులను ఆశ్రయించిన భర్త’.. ఇవీ ఇప్పటి సతీమణులు సంగతి. మద్దతు తెలిపేందుకు మగాళ్లకు సంఘాలు లేవు కానీ, ఉండుంటే.. కార్యాలయం ముందు బారులు తీరేవారు. 

బహుశా.. మన వార్తలోని ఆటోడ్రైవరన్న భార్య బాధితుడే ఉన్నట్టున్నారు. ఇన్నాళ్లు ఆ మహాతల్లి ఎంత వేపుకుతుందో ఏమో ఇతగాడిని. భార్య పుట్టింటికి వెళ్లగానే.. ప్రపంచానికి తెలిసేలా ప్రకటనలు కొట్టించాడు.
  
బెంగళూరుకు చెందిన ఒక ఆటో డ్రైవర్ భార్య పుట్టింటికి వెళ్లగా.. అతడు సంబరాలు చేసుకోవడం వైరల్‌గా మారింది.  నా పెళ్లాం పుట్టింటికి వెళ్లింది, నేను చాలా హ్యాపీ.. అంటూ తన ఆటోలో వెనుకవైపు అతికించాడు. తన భాగస్వామి వచ్చేవరకు తన స్వేచ్ఛకు అడ్డులేదని దానర్థం. తన ఆటో ఎక్కిన ప్రతి ఒక్కరికీ ఆ విషయం తెలియాలనే అతను ఆ విధంగా చేశాడు. అంతేకాదు, ఎక్కిన ప్రతి ఒక్కరికి బిస్కెట్లు పంచి పెట్టాడు. ఈ విషయాన్ని అతని ఆటో ఎక్కిన ప్రయాణీకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by EPIC MEDIA (@_epic69)

మగాళ్ల మద్దతు.. ఆడవాళ్ల విమర్శలు

 ఇతగాడి చర్యలపై భిన్న రకాల కామెంట్లు వస్తున్నాయి. భార్య పుట్టింటికి వెళ్లినప్పుడే మగాడికి స్వేచ్ఛ..'' అని తోటి మగజాతి ఆణిముత్యాలు అన్నారు. అదే సమయంలో ఆడవాళ్లు అతన్ని విమర్శిస్తున్నారు. బహుశా.. భార్యను పోషించలేక పుట్టింటికి పంపాడామో అని వెటకారపు పోస్టులు పెడుతున్నారు.