కేటీఆర్పై మైనంపల్లి ఫైర్..రాహుల్, రేవంత్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం

కేటీఆర్పై మైనంపల్లి ఫైర్..రాహుల్, రేవంత్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు నోరుపారేసుకుంటే చూస్తూ ఊరుకోమని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఫైర్​ అయ్యారు. రాహుల్ పై మాట్లాడే స్థాయి నీదా అని ఆ కుటుంబానికి ఉన్న త్యాగాల చరిత్ర నీ కుటుంబానికి ఏముందని ప్రశ్నించారు. శనివారం ఆయన గాంధీ భవన్​లో మీడియాతో మాట్లాడారు. రౌడీయిజం చేసేవాళ్లం మేము కాదని, రౌడీయిజం చేసేవాళ్ల​తోలుతీసే వాళ్లం మేము అని హెచ్చరించారు.

గ్రేటర్ ఎన్నికల్లో మీకు చుక్కలు చూపించడానికి జనం సిద్ధంగా ఉన్నారని ఎద్దే వా చేశారు. అమెరికా నుంచి వచ్చి పదవులు అనుభవించిన నీవు, సొంత చెల్లి ఫోన్ ట్యాప్ చేసిన నీచ చరిత్ర నీదని ధ్వజమెత్తారు. దండపాళ్యం బ్యాచ్, స్టువర్టుపురం బ్యాచ్ మీది అని కేటీఆర్​పై విరుచుకుపడ్డారు. దాడులకు ప్రతిదాడులు తప్పవని హెచ్చరించారు.