
హుషారు, షికారు, రౌడీ బాయ్స్ లాంటి సూపర్‌హిట్ చిత్రాలలో నటించిన ‘తేజ్ కూరపాటి’ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా మరో చిత్రంలో నటిస్తున్నాడు. రాజధాని ఆర్ట్ మూవీస్ బ్యానర్, జీవీ ఆర్ ఫిల్మ్ మేకర్స్ పై వెంకట్ వందెల దర్శకత్వంలో “నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా” మూవీలో హీరోగా నటిస్తున్నాడు. హీరోయిన్ గా అఖిల ఆకర్షణ నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి ఇప్పటివరకు విడుదలైన పాటలకు సంగీత ప్రియుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఓ పాటను మేకర్స్ విడుదల చేశారు. డా భవ్య దీప్తి రెడ్డి రచించిన 'ఏకాంత సమయం' అనే లిరికల్ వీడియోను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ ముల్లేటి నాగేశ్వరావు మాట్లాడుతూ... హీరో శ్రీకాంత్ ఎంతో బిజీగా ఉన్నా ‘ఏకాంత సమయం' అనే లిరికల్ వీడియో సాంగ్ ను లాంచ్ చేసినందుకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. చక్కటి కథతో దర్శకుడు వెంకట్ ఈ సినిమాను తెరకెక్కించినట్లు.. డా భవ్య దీప్తిరెడ్డి ఈ సినిమాకు ఐదు పాటలు రాయడం జరిగిందన్నారు.
సంగీత దర్శకుడు సందీప్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులకు ఇట్టే ఆకట్టుకుంటాయన్నారు. సినిమాలో నటించిన నటీ, నటులు టెక్నిషియన్స్ అందరూ బాగా వర్క్ చేయడంతో సినిమా బాగా వచ్చిందన్నారు. సెప్టెంబర్ 2న వస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాత ముల్లేటి కమలాక్షి మాట్లాడుతూ... ప్రేమకథను దర్శకుడు వెంకట్ చాలా బాగా డైరెక్షన్ చేశాడని, అనుకున్న టైమ్, బడ్జెట్ లో ఈ సినిమా తీశామన్నారు. ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చిత్ర దర్శకుడు వెంకట్ వందెల మాట్లాడుతూ...పల్లెటూరి నేపధ్యం లో సాగే చక్కటి ప్రేమకథగా తెరకెక్కించామన్నారు. ఈ చిత్రంలోని 'ఏకాంత సమయం' అనే లిరికల్ వీడియోను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్ కు ధన్యవాదాలు తెలియచేస్తున్నామన్నారు. ఇలాంటి మంచి చిత్రం చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో యూత్ కి కావాల్సిన అన్ని అంశాలు ఉంటాయన్నారు. ప్రేమకథతో పాటు చక్కటి వినోదం కూడా ఉందన్నారు.