
ఓ వైపు హీరోయిన్‌గా బిజీగా ఉంటూనే, మరోవైపు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది నభా నటేష్. ఎప్పటికప్పుడు డిఫరెంట్ ఫోటో షూట్స్ షేర్ చేసి అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా మరోసారి గ్లామర్ ట్రీట్‌ను అందించింది. వైట్ డ్రెస్‌లో యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది ఆమె లుక్. ఈ ఫొటోలను షేర్ చేసిన నభా.. ‘గ్లామర్‌తో అలసిపోయాను. కానీ మిలియన్ సంవత్సరాల్లో కాదు..’ అంటూ పోస్ట్ చేసిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఆమె ప్రస్తుతం పలు ఇంట్రస్టింగ్ ప్రాజెక్టుల్లో నటిస్తోంది.
నిఖిల్ హీరోగా నటిస్తున్న ‘స్వయంభూ’ సినిమాతో పాటు ‘నాగబంధం’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. వీటితోపాటు మరికొన్ని క్రేజీ చిత్రాలు లైనప్‌లో ఉన్నాయి. వీటిలో ‘స్వయంభూ’ చిత్రం డిసెంబర్‌లో రిలీజ్‌కు రెడీ అవుతుంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో నభా నటేష్ ట్రెడిషినల్ గెటప్‌లో కనిపించనుంది. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు.