భూ వివాదంలో నయీమ్ సోదరి అరెస్ట్

భూ వివాదంలో నయీమ్ సోదరి అరెస్ట్

భువనగిరి, వెలుగు: గ్యాంగ్​స్టర్​నయీమ్ సోదరి సలీమా బేగంను బుధవారం యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. భువనగిరి పరిధిలోని సర్వేనెంబర్ 590, 586లో గల భూమిని యజమాని కూరపాటి అభినందన్ ప్లాట్లు చేసి 2006 సంవత్సరం కంటే ముందే అమ్మేశాడు. అభినందన్ 2007లో సలీమా బేగంతో కుమ్మక్కై  అమ్మిన ప్లాట్లను బలవంతంగా నయీమ్ అనుచరుల పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాడు.

2006లో 9 ఎకరాలను యజమానులు కూరపాటి శ్రీదేవి, కూరపాటి శ్రీనివాసులను బెదిరించి సలీమా బేగం తన కుటుంబసభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఆ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎడ్ల వెంకట్ రెడ్డికి అమ్మారు. అతడు వెంచర్​చేసి ప్లాట్లను అమ్మాడు. ఈ భూవివాదం కేసులో సెక్షన్ 447, 427, 386 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా బుధవారం సలీమా బేగంను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.

మరిన్ని వార్తల కోసం