కస్టడీ స్పెషల్ గ్లింప్స్‌

కస్టడీ స్పెషల్ గ్లింప్స్‌

కిందటేడాది  బంగార్రాజు, థ్యాంక్యూ, లాల్ సింగ్ చద్ధా లాంటి మూడు డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగ చైతన్య.. ఈ ఏడాది ‘కస్టడీ’ అనే యాక్షన్ మూవీతో రాబోతున్నాడు. వెంకట్ ప్రభు దర్శకుడు.  కృతిశెట్టి హీరోయిన్‌‌‌‌. తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకున్న టీమ్, న్యూఇయర్‌‌‌‌‌‌‌‌కి స్పెషల్ గ్లింప్స్‌‌‌‌ను రిలీజ్ చేసింది. ఇందులో చైతు ఫ్యాన్స్‌‌‌‌ని ఎక్సయిట్ చేసే అంశాలు ఉన్నాయి. గ్రిప్పింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఏరియల్ షాట్‌‌‌‌లతో వీడియో ప్రారంభమవుతుంది.  

ట్రైన్ దూసుకురావడం,  కార్లు పైకి పేలడం, నాగ చైతన్య విలన్స్‌‌‌‌కు పవర్ ఫుల్ పంచ్‌‌‌‌లు, కిక్‌‌‌‌లు ఇస్తూ యాక్షన్‌‌‌‌లోకి దిగడం వీడియోలో చూపించారు. ఫెరోషియస్ లుక్‌‌‌‌లో కనిపిస్తున్న చైతు ఇంప్రెస్ చేస్తున్నాడు. అరవింద్ స్వామి విలన్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ ఇతర ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలిసి సంగీతం అందిస్తుండటం విశేషం. మే 12న సినిమా రిలీజ్ చేయనున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేశారు.