
విరూపాక్ష మూవీ తెరకెక్కించిన డైరెక్టర్ కార్తీక్ దండు అక్కినేని నాగచైతన్య(Nagachaithanya)తో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే అదిరిపోయే థ్రిల్లర్ స్టోరీని చైకి వినిపించాడట కార్తీక్.
డైరెక్టర్ కార్తీక్ చెప్పిన కథ నచ్చడంతో చై గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ ఇంట్రెస్టింగ్ కాంబో నుంచి ఆఫీసియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లో బుట్టబొమ్మ పూజాకు ఆఫర్ దక్కిందట. చాలా కాలంగా టాలీవుడ్ లో మంచి కంబ్యాక్ కోసం ప్రయత్నిస్తున్న పూజాకు ఈ అవకాశం రావడం గ్రేట్ అనే చెప్పుకోవాలి.
ఇప్పటికే నాగ చైతన్య, పూజా హెగ్డే `ఒక లైలా కోసం` సినిమాలో నటించి మెప్పించారు. మళ్ళీ ఇన్నాళ్లకు ఈ సూపర్ హిట్ జోడీ వస్తుండటం ఫ్యాన్స్ కు కూడా నచ్చేసిందని టాక్. మరి పూజా ని నిజంగా తీసుకున్నారా లేదా అనేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే..నాగ చైతన్య కి వంద కోట్ల హిట్ పడితే చూడాలన్నది అక్కినేని ఫ్యాన్స్ కల. ఎందుకంటే, బంగార్రాజు,లవ్ స్టోరీ చిత్రాలు వచ్చి పర్లేదు అనిపించినా బాక్సాఫీస్ బాద్ షా అనిపించుకోలే. ఒక మోస్తరు హిట్ కంటే.. హై రేంజ్ హిట్ కావాలంటూ ఫ్యాన్స్ గిరి గీసీ పెట్టుకున్నారు.
డైరెక్టర్ కార్తీక్ దండు విజన్ పై విరూపాక్ష మూవీతో ప్రతిఒక్కరికీ తెలిసింది. ఇక చైతో ఒక గట్టి హిట్ కొట్టేయండి బాస్..అంటూ ఫ్యాన్స్ హోప్స్ పెట్టుకున్నారు. మరి త్వరలో అధికారిక ప్రకటనతో పాటు స్టోరీ ఎలాంటిదో కూడా తెలిసిపోతుంది.ప్రస్తుతం చై తండేల్ మూవీతో బిజీగా ఉన్నారు.
also read : పార్కింగ్ లొల్లి.. నటి శరణ్యపై కేసు నమోదు
గతంలో ఓ మైథికల్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ తో రాబోతున్నట్లు కార్తీక్ దండు పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రపంచంలో నమ్మ శక్యం కానీ విషయాలను..నమ్మడానికి సిద్ధంగా ఉండండి ఉంటూ సుకుమార్( Sukumar) సైతం ట్వీట్ చేశారు. ఈ మూవీకు కూడా సుకుమార్ స్టోరీ అందిస్తుండగా..కార్తిక్ దండు డైరెక్షన్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ థ్రిల్లర్‌ను బోగవల్లి ప్రసాద్ - సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.కానీ, అందులో నటీనటులు ఎవరనేది అనౌన్స్ చేయలేదు. అయితే, అదే ప్రాజెక్ట్ హ? లేక వేరే స్టోరీతో వస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.
The Team Of #Virupaksha is back! ?
— SVCC (@SVCCofficial) August 14, 2023
Get ready to believe in the unbelievable, this time it’s a MYTHICAL THRILLER ?
Directed by @karthikdandu86 ?
Produced by @SVCCofficial & @SukumarWritings ?
Pre-Production Works Begins From Today! ✨
Stay tuned for more details soon! pic.twitter.com/LboCQU2nOu