
జనసేన తరపున నర్సాపురం లోక్ సభ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా తనతో పాటు తన భార్య పేరుతో రూ. 41 కోట్ల ఆస్తులున్నట్లు అఫిడవుట్ లో తెలిపారు. ఇందులో చరాస్థులు రూ. 36,73,50,772 , స్థిరాస్థులు రూ. 4,22,74,477 చూపించారు. అదే విధంగా రూ. 2,70,49,798 అప్పులు ఉన్నట్లు తెలిపారు. ఇటీవలె జనసేనలో చేరిన నాగబాబు నర్సాపురం లోక్ సభ నుంచి పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా 52 కోట్ల ఆస్తులు, 34 కోట్ల అప్పులున్నట్లు అఫిడవుట్ లో చెప్పారు.