హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టును బీఆర్‌ఎస్ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఖండించారు. సుప్రీం కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా.. ఈడీ అధికారులు ఎలా అరెస్టు చేస్తారంటూ ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కవిత అరెస్టు వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని నాగం ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత కడిగిన ముత్యంలా, నిర్దోషిగా బయటికి వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయస్థానాల మీద తమకు పూర్తిగా నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.
