ఇంటర్ పరీక్షల కు పకడ్బందీ ఏర్పాట్లు : నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్

ఇంటర్ పరీక్షల కు పకడ్బందీ ఏర్పాట్లు :  నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్
  •     నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ కలెక్టర్ బదావత్​ సంతోష్​ ఆదేశం

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ జిల్లాలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 34 కేంద్రాల్లో ఫస్ట్​ ఇయర్​ 7,557 మంది, సెకండ్​ ఇయర్​7,616 మంది స్టూడెంట్స్​ హాజరుకానున్నారని తెలిపారు. 

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని, విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, ప్రథమ చికిత్స కేంద్రాలు, రవాణా సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు. ప్రశ్నాపత్రాల తరలింపులో పోలీసు బందోబస్తు ఉండాలని, పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లను అనుమతించకూడదని స్పష్టం చేశారు.  డీఈఓ రమేశ్​కుమార్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు పాల్గొన్నారు.