సమస్యలు పరిష్కరించాలని స్టూడెంట్ల ఆందోళన..నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లా కొల్లాపూర్‌ లో రాస్తారోకో

సమస్యలు పరిష్కరించాలని స్టూడెంట్ల ఆందోళన..నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లా కొల్లాపూర్‌ లో రాస్తారోకో

కొల్లాపూర్, వెలుగు : నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లా కొల్లాపూర్‌‌ పీజీ క్యాంపస్‌‌లో సమస్యలు పరిష్కరించాలని, నాణ్యమైన భోజనం పెట్టాలని డిమాండ్‌‌ చేస్తూ స్టూడెంట్లు బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా స్టూడెంట్లు మాట్లాడుతూ... కాలేజీ ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ మెనూ పాటించడం లేదని, క్వాలిటీ లేని భోజనం పెడుతున్నారని ఆరోపించారు.

భోజనం సరిగా పెట్టకపోవడంతో గత నెల 26న ఇద్దరు అమ్మాయిలు అస్వస్థతకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు ప్రిన్సిపాల్‌‌ను కలిసినా స్పందించడం లేదన్నారు. గర్ల్స్ హాస్టల్‌‌ పరిసర ప్రాంతాల్లో పారిశుధ్యం సరిగా లేకపోవడంతో పాములు, తేళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి మెనూ పాటించాలని, క్వాలిటీ భోజనాన్ని అందించడంతో పాటు హాస్టల్‌‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌‌ చేశారు. లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.ఆది, పీజీ కాలేజీ అధ్యక్ష కార్యదర్శులు విలాస్, శివ పాల్గొన్నారు.