సీఎం నకిరేకల్ పర్యటనను సక్సెస్ చేయాలి : కలెక్టర్ బి.చంద్రశేఖర్

సీఎం నకిరేకల్ పర్యటనను సక్సెస్ చేయాలి : కలెక్టర్ బి.చంద్రశేఖర్

నల్గొండ/నకిరేకల్​, వెలుగు:  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నకిరేకల్ పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. సీఎం పర్యటన నేపథ్యంలో శుక్రవారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, భద్రతాధికారులతో కలిసి నకిరేకల్‌‌‌‌‌‌‌‌లోని హెలిప్యాడ్, సభా స్థలాలు, నూతన ప్రాంతీయ వైద్యశాలను పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.