యూనిఫాంలోనే సూసైడ్ చేసుకున్న కానిస్టేబుల్

యూనిఫాంలోనే సూసైడ్ చేసుకున్న కానిస్టేబుల్

విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నాడు. అది కూడా ఖాకీ డ్రెస్ వేసుకొని ఉరివేసుకొని చనిపోయాడు. నల్గొండ జిల్లా మర్రిగూడ పోలీస్ స్టేషన్‌లో సైదులు అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఏ సమస్య వచ్చిందో ఏమో గానీ.. ఆయన రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని తిరుమల దేవున్ని గుట్ట సమీపంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.