- ఉమ్మడి నల్గొండ జిల్లా బాధితుల ఆవేదన
- ప్రభుత్వం న్యాయం చేయాలని వేడుకోలు
పంజాగుట్ట, వెలుగు: మైక్రో ఫైనాన్స్ మోసం కేసులో సింగర్ మంగ్లీనే అసలు బాధ్యురాలని ఉమ్మడి నల్గొండ జిల్లా బాధితులు ఆరోపించారు. మంగ్లీ, ఆమె తమ్ముడు రమావత్ మధును చూసే తాము పెట్టుబడులు పెట్టామని, ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. శుక్రవారం ఉమ్మడి నల్గొండ నుంచి వచ్చిన 20 మంది బాధితులతో కలిసి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రమావత్ రమేశ్ మాట్లాడారు.
చిన్నపాటి పనులు చేసుకునే తాము బంధువుల వద్ద అప్పులు తెచ్చి మరీ మంగ్లీ, ఆమె తమ్ముడు రమావత్ మధుపై భరోసాతో డబ్బులు పెట్టామని, మంగ్లీ కార్యాలయానికి వచ్చిన ఫోటోలే అందుకు నిదర్శనమన్నారు. బంజారా నాయకుడు సంపత్ నాయక్ మాట్లాడుతూ.. మంగ్లీ గిరిజన కార్డును వాడుకుంటూ తనను తాను రక్షించుకోవాలని చూడటం సరికాదని, సొంత జాతి ప్రజలనే మోసం చేయడం ఆమె విచక్షణకే వదిలేస్తున్నామని విమర్శించారు. త్వరలో మరిన్ని వాస్తవాలను బయటకు వస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఓయూ జేఏసీ నేత సంపత్ నాయక్, విప్లవ్, రేణు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

