ప్రభుత్వం ప్రకటన చేస్తే చర్చలకు సిద్ధం

V6 Velugu Posted on Nov 30, 2021

కేంద్ర ప్రభుత్వం తీరుతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు లోక్ సభలో  టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు. 60 రోజులుగా రైతులు ధాన్యం సేకరించాలని కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. అందుకే పార్లమెంట్ వేదికగా నిరసన తెలుపుతున్నామన్నారు. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం ప్రకటన చేస్తే చర్చలకు సిద్ధమన్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఓ రకంగా.. తెలంగాణలో మరో  రకంగా చెబుతూ ద్వంద వైఖరి అవలంభిస్తోందన్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం సభలో ప్రకటన చేయాలని స్పీకర్ ద్వారా కేంద్రాన్ని కోరారు.

Tagged TRS, parliment, paddy, nama nageswar rao

Latest Videos

Subscribe Now

More News