ఈ బ్యాట్స్ మెన్ పేరు చెప్పండి : వరల్డ్ కప్ వెరైటీ ప్రమోషన్స్

ఈ బ్యాట్స్ మెన్ పేరు చెప్పండి : వరల్డ్ కప్ వెరైటీ ప్రమోషన్స్

వరల్డ్ కప్ తగ్గరపడుతున్నకొద్దీ క్రికెట్ అభిమానులకు ఆకట్టుకునే పనిలో పడింది క్రికెట్ వరల్డ్ కప్ యూనిట్.  ఓ బ్యాట్స్ మెన్ షాడో ఫొటోను ఇవాళ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. కొంచెం పొట్టిగా ఉండి, సిక్స్ కొట్టడానికి రెడీగా ఉన్నట్లు ఉంది ఈ పిక్. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా..అసలు ఈ బ్యాట్స్ మెన్ ఎవరు అనేదానిపై చర్చ జరుగుతుంది. ఒకరు సచిన్ అని, మరోకరు ధోనీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పలు దేశాలను సంబందించినవారు తమ అభిమాన ప్లేయర్ల పేర్లు చెబుతున్నారు.

ఫొటో చూస్తే బ్యాట్స్ మెన్ పేరు చెప్పడం కష్టంగానే ఉందని..ఏదైనా క్లూ ప్లీస్ అంటూ రీట్వీట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి ఈ అసలు బ్యాట్స్ మెన్ వివరాలు ఎప్పుడు తెలుపుతారా అని వెయిటింగ్ చేస్తామంటున్నారు. అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వరల్డ్ కప్ మే -24నుంచి ప్రారంభం కానుంది. మే-25న భారత్..న్యూజిలాండ్ తో ఫస్ట్ మ్యాచ్ ఆడనుంది.