టీ20 వరల్డ్ కప్‌కు నమీబియా అర్హత.. ఒక్క స్పాట్ కోసం ఆ మూడు దేశాలు

టీ20 వరల్డ్ కప్‌కు నమీబియా అర్హత.. ఒక్క స్పాట్ కోసం ఆ మూడు దేశాలు

వెస్టిండీస్,అమెరికా ఆతిధ్యమిస్తున్న 2024 టీ20 వరల్డ్ కప్ కు నమీబియా అర్హత సాధించింది. దీంతో వరుసగా మూడోసారి టీ20 ప్రపంచ కప్ ఆడేందుకు సిద్ధమైంది. ఆఫ్రికా క్వాలిఫైయర్ నుండి మొత్తం 7 జట్లు తలపడుతుండగా 2 జట్లు మాత్రమే అర్హత సాధిస్తాయి. టోర్నీలో 5 మ్యాచ్ లాడిన నమీబియా 5 మ్యాచ్ ల్లో గెలిచి టాప్-2 లో నిలిచింది. ఆ జట్టు మిగిలిన ఒక్క మ్యాచ్ లో ఓడిపోయినా టాప్-2 లో ఉండడం ఖాయమైంది. దీంతో 2024 టీ20 వరల్డ్ కప్ కు క్వాలిఫై అయిన 19వ జట్టుగా నమీబియా నిలిచింది. 

ఉగాండా, కెన్యా, జింబాబ్వే, నైజీరియా మిగిలిన ఒక్క స్థానం కోసం పోరాడనున్నాయి. మంగళవారం జరిగిన క్వాలిఫయర్స్‌లో టాంజానియాను 58 పరుగుల తేడాతో నమీబియా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుమిగులు చేసింది. JJ స్మిత్ 25 బంతుల్లో 4 సిక్సర్లతో 40 పరుగులు చేసాడు. ఆ తర్వాత లక్ష్య చేధనకు దిగిన టాంజానియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 99 పరుగులే చేసింది. ఎరాస్మస్ తన ఆఫ్-బ్రేక్ బౌలింగ్‌తో 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. 

జూన్ 4 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 20 దేశాలు టైటిల్ కోసం తలపడనున్నాయి. వెస్టిండీస్ (ఆతిథ్య),USA (హోస్ట్‌) దేశాలు ఆతిథ్య దేశాలుగా అడుగుపెడతాయి. ఆస్ట్రేలియా,ఇంగ్లండ్,భారత్,నెదర్లాండ్స్,న్యూజిలాండ్, పాకిస్తాన్,దక్షిణాఫ్రికా,శ్రీలంక,ఆఫ్ఘనిస్తాన్,బంగ్లాదేశ్ జట్లు ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్-10లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా అర్హత సాధించాయి. స్కాట్లాండ్ (యూరోప్ క్వాలిఫైయర్),ఐర్లాండ్ (యూరోప్ క్వాలిఫైయర్),పాపువా న్యూ గినియా (తూర్పు-ఆసియా పసిఫిక్ క్వాలిఫైయర్),నేపాల్,ఒమన్,కెనడా,ఆఫ్రికా, నమీబియా క్వాలిఫైయర్ మ్యాచ్ ల ద్వారా అర్హత సాధించాయి.