- కొత్త చట్టాలపై చర్చించిన న్యాయమూర్తి మంద మురళి
హైదరాబాద్, వెలుగు: నాంపల్లి కోర్టు స్పెషల్ 10వ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ మంద మురళి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్సజ్జనార్ తో భేటీ అయ్యారు. గురువారం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో.. ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలు, వాటి అమలులో ఎదురయ్యే సవాళ్లు వంటి అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ మురళి మాట్లాడుతూ.. కొత్త చట్టాల అమలులో పారదర్శకత, సమర్థత అత్యంత కీలకమని, పోలీస్ శాఖ సహకారం అవసరమన్నారు. సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. న్యాయస్థానాల మార్గదర్శకాలు పోలీస్ శాఖకు దిశానిర్దేశం చేస్తాయని, కొత్త చట్టాలపై అధికారులకు ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు.
