గ్రీన్ ఇండియా ఛాలెంజ్‪ని స్వీకరించిన నమ్రతా శిరోద్కర్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‪ని స్వీకరించిన నమ్రతా శిరోద్కర్

సినీ నటి నమ్రతా శిరోద్కర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించినందుకు ఎంపీ సంతోష్ కుమార్ ఆమెకు ధన్యవాదాలు తెలియజేశారు. మన చుట్టూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్మించడంలో సహాయపడటానికి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రచారం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతకుముందు గ్రీన్ ఇండియా చాలెంజ్ కి తనను నామినేట్ చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి నమ్రత ధన్యవాదాలు తెలిపారు . మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అందరూ మొక్కలు నాటాలని కోరుతున్నానన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఓ వీడియోను కూడా షేర్ చేశారు.