గాదె ఇన్నయ్య కుటుంబంలో మరో విషాదం..

గాదె ఇన్నయ్య కుటుంబంలో మరో  విషాదం..

సామాజిక ఉద్యమకారుడు  గాదె ఇన్నయ్య ఇంట్లో మరో విషాదం నెలకొంది.  తల్లి మరణం నుంచి తేరుకోకముందే ఇవాళ ఆయన తండ్రి  సాల్మోన్  రెడ్డి  కన్నుమూశారు.  గత కొంతకాలంగా అనారోగ్యంతో మంచానికే పరిమితమైన సాల్మోన్ రెడ్డి తన ఇంట్లో ఫిబ్రవరి 28న  తెల్లవారు జామున  తుదిశ్వాస విడిచారు. UAPA చట్టం కింద అరెస్టైన  గాదె ఇన్నయ్య రిమాండ్ లో ఉన్నాడు. 

జనవరి 15న గాదెన్నయ్య తల్లి తెరేసమ్మ  మృతి చెందడంతో బెయిల్ పై వచ్చిన గాదె ఇన్నయ్య తల్లి అంత్యక్రియలకు హాజరయ్యారు. తల్లి మరణం నుంచి కోలుకోకముందే తండ్రి చనిపోవడంతో ఆయన కుటుంబంలో విషాదం ఛాయలు అలుముకున్నాయి. 

జనవరి 13 గాదె ఇన్నయ్య ఇల్లు, ఆశ్రమంలో మంగళవారం నేషనల్​ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్​ఐఏ) అధికారులు సోదాలు నిర్వహించారు. జనగామ జిల్లా జాఫర్​గడ్​ మండలం సాగరంలోని ఇన్నయ్య ఇంటితోపాటు జాఫర్​గడ్​లోని ‘మా ఇల్లు’ ఆశ్రమంలో ఒకేసారి తనిఖీలు చేశారు. ఆఫీస్​లో అమరవీరుల బంధుమిత్రుల కమిటీకి చెందిన కీలక పత్రాలు, బ్యాంకు పాస్​బుక్​లు, డైరీలు, ఐఫోన్, ల్యాప్​లాప్​లు, భూమి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది