సెలెక్షన్ కమిటీ చైర్మన్గా ప్రజ్ఞాన్ ఓజా!

సెలెక్షన్ కమిటీ చైర్మన్గా ప్రజ్ఞాన్ ఓజా!

న్యూఢిల్లీ: బీసీసీఐ సెలెక్షన్‌‌‌‌‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా ప్రజ్ఞాన్‌‌‌‌‌‌‌‌ ఓజాకు మార్గం దాదాపుగా సుగమమైంది. సెలెక్షన్‌‌‌‌‌‌‌‌ కమిటీలో వెస్ట్‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌ ప్రతినిధి పదవికి మాజీ వికెట్‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌ పార్థివ్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ దరఖాస్తు చేయలేదు. అజిత్‌‌‌‌‌‌‌‌ అగార్కర్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో పార్థివ్‌‌‌‌‌‌‌‌ వస్తాడని ప్రచారం జరిగినా.. దరఖాస్తుకు చివరి తేదీ అయిన బుధవారం వరకు అతను ఎలాంటి పత్రాలు దాఖలు చేయలేదు. 

గడువు పెంచితే తప్ప పార్థివ్‌‌‌‌‌‌‌‌కు దరఖాస్తు చేసుకునే చాన్స్‌‌‌‌‌‌‌‌ దక్కదు. ప్రస్తుత సెలెక్టర్లలో అత్యధిక టెస్ట్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఆడిన అనుభవం ఉండటంతో సౌత్‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌ ప్రతినిధి ప్రజ్ఞాన్‌‌‌‌‌‌‌‌ ఓజానే చైర్మన్‌‌‌‌‌‌‌‌ బాధ్యతల్లో కొనసాగనున్నాడు.  జూనియర్‌‌‌‌‌‌‌‌ సెలెక్షన్‌‌‌‌‌‌‌‌ కమిటీ  చైర్మన్‌‌‌‌‌‌‌‌గా బాధ్యతలు చేపడతాడని అంచనాలు ఉన్న రమేష్‌‌‌‌‌‌‌‌ పవార్‌‌‌‌‌‌‌‌... ఇప్పుడు వెస్ట్‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌ నుంచి సీనియర్‌‌‌‌‌‌‌‌ సెలెక్టర్‌‌‌‌‌‌‌‌ రేసులోకి వచ్చే అవకాశం ఉంది. మాజీ వికెట్‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌ సమీర్‌‌‌‌‌‌‌‌ దిఘే పేరు కూడా పరిశీలనలో ఉంది. 

ఈ జోన్‌‌‌‌‌‌‌‌ నుంచి అర్హులైన వారి జాబితా చాలా పరిమితంగా ఉండటంతో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.  పార్థివ్‌‌‌‌‌‌‌‌ ప్రస్తుతం ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ ఫ్రాంచైజీ గుజరాత్‌‌‌‌‌‌‌‌ టైటాన్స్‌‌‌‌‌‌‌‌ కోచింగ్‌‌‌‌‌‌‌‌ సిబ్బందిగా, కామెంటేటర్‌‌‌‌‌‌‌‌గా కొనసాగుతున్నాడు.