ఐసీసీ ర్యాంకింగ్స్ను మెరుగుపర్చుకున్న శ్రేయర్ అయ్యర్

 ఐసీసీ ర్యాంకింగ్స్ను మెరుగుపర్చుకున్న శ్రేయర్ అయ్యర్

దుబాయ్‌‌‌‌‌‌‌‌: టీమిండియా టీ20 కెప్టెన్‌‌‌‌‌‌‌‌ శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌.. ఐసీసీ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌ను మెరుగుపర్చుకున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో శ్రేయస్‌‌‌‌‌‌‌‌ (798) మూడు ప్లేస్‌‌‌‌‌‌‌‌లు ఎగబాకి నాలుగో ర్యాంక్‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు. విండీస్‌‌‌‌‌‌‌‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌లో భాగంగా లక్నోలో జరిగిన తొలి టీ20లో శ్రేయస్‌‌‌‌‌‌‌‌ సెంచరీ కొట్టడం కలిసొచ్చింది. 

ఇషాన్‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌ (904), అభిషేక్‌‌‌‌‌‌‌‌ శర్మ (891) వరుసగా టాప్‌‌‌‌‌‌‌‌–2లో కొనసాగుతున్నారు. హైదరాబాదీ బ్యాటర్‌‌‌‌‌‌‌‌ తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మ (731), సంజూ శాంసన్‌‌‌‌‌‌‌‌ (605) వరుసగా 9, 27వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. టెస్ట్‌‌‌‌‌‌‌‌ ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్ల జాబితాలో వెటరన్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.