బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ ప్రమోద్పై వేటు

 బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ ప్రమోద్పై వేటు

న్యూఢిల్లీ: బాక్సింగ్‌‌‌‌‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా (బీఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ) సెక్రటరీ జనరల్‌‌‌‌‌‌‌‌ ప్రమోద్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌పై వేటుపడింది. ఆర్థికపరమైన అవకతవకలు, విచారణకు సహకరించకపోవడం, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అతన్ని సస్పెండ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ అజయ్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ ఉత్తర్వులు జారీ చేశాడు. గ్రేటర్ నోయిడాలో గత ఏడాది కొత్తగా జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఫైనల్స్ కప్‌‌‌‌‌‌‌‌ ప్రసారాల విషయంలో అనుమతి లేకుండా వర్క్ ఆర్డర్ జారీ చేశారని అజయ్ సింగ్ పేర్కొన్నాడు. 

అలాగే హిమాచల్ ప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని నహాన్‌‌‌‌‌‌‌‌లో జరగాల్సిన నేషనల్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ రద్దుపై జరిగిన విచారణకు ప్రమోద్ కుమార్ సహకరించలేదని ఆరోపించాడు. ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ అజయ్ సింగ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరుణ్ మాలిక్‌‌‌‌‌‌‌‌లపై ప్రధాని నరేంద్ర మోదీకి ప్రమోద్ కుమార్ ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. 

ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రమోద్ కుమార్ ప్రయత్నించారని, ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా ఈ నెల 28న ప్రత్యేక సర్వసభ్య సమావేశానికి (ఎస్‌‌‌‌‌‌‌‌జీఎం) నోటీసులు జారీ చేశారని బీఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ పేర్కొంది. అయితే ప్రస్తుతానికి ఇది తాత్కాలిక సస్పెన్షన్ మాత్రమేనని, తదుపరి విచారణ పూర్తయ్యేవరకు ఆయన కార్యదర్శి హోదాలో ఎలాంటి విధులను నిర్వర్తించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.