సూపర్ వెల్టర్ వెయిట్ (69.9 కేజీ) విభాగంలో నీరజ్‌‌‌‌‌‌‌‌ X పెటిస్‌‌‌‌‌‌‌‌

సూపర్ వెల్టర్ వెయిట్ (69.9 కేజీ) విభాగంలో నీరజ్‌‌‌‌‌‌‌‌ X పెటిస్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియా ప్రొఫెషనల్‌‌‌‌‌‌‌‌ బాక్సర్‌‌‌‌‌‌‌‌ నీరజ్‌‌‌‌‌‌‌‌ గోయట్‌‌‌‌‌‌‌‌.. వచ్చే ఏడాది జనవరి 23న మాజీ యూఎఫ్‌‌‌‌‌‌‌‌సీ లైట్‌‌‌‌‌‌‌‌ వెయిట్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌ ఆంటోని పెటిస్‌‌‌‌‌‌‌‌తో తలపడనున్నాడు. ఆరు రౌండ్ల సూపర్‌‌‌‌‌‌‌‌ వెల్టర్‌‌‌‌‌‌‌‌ వెయిట్‌‌‌‌‌‌‌‌ (69.9 కేజీ) విభాగంలో ఈ హైవోల్టేజ్‌‌‌‌‌‌‌‌ ప్రొఫెషనల్‌‌‌‌‌‌‌‌ పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ నిర్వహణ కోసం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, విశాఖపట్నం, చెన్నై రేసులో ఉన్నాయి.

మాజీ యూఎఫ్‌‌‌‌‌‌‌‌సీ స్టార్ పెటిస్ ప్రధానంగా మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) ఫైటర్.  అతను చివరిసారిగా 2024లో  ఓటమి చవిచూశాడు. మరోవైపు 34 ఏళ్ల నీరజ్ గోయత్ తన ప్రొఫెషనల్ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇప్పటివరకు 27 బౌట్స్‌‌‌‌‌‌‌‌ల్లో 21 విజయాలు సాధించాడు. ప్రస్తుతం నీరజ్‌‌‌‌‌‌‌‌ వరుసగా నాలుగు విజయాలతో మంచి ఊపులో ఉన్నాడు. ఆగస్టులో బర్మింగ్‌‌‌‌‌‌‌‌హామ్‌‌‌‌‌‌‌‌లో జరిగిన పోరులోనూ విజయం సాధించాడు. డబ్ల్యూబీసీ ర్యాంకింగ్ పొందిన తొలి ఇండియన్‌‌‌‌‌‌‌‌ బాక్సర్‌‌‌‌‌‌‌‌గా, మాజీ డబ్ల్యూబీసీ ఆసియా చాంపియన్‌‌‌‌‌‌‌‌గా నీరజ్ గుర్తింపు పొందాడు.