- ప్రత్యేక అధికారుల పాలనలో చేసిన టెండర్లు, తైబజార్ పన్ను రద్దు
- నిర్మల్ మున్సిపల్ చైర్పర్సన్ కావ్య
నిర్మల్, వెలుగు: మున్సిపాలిటీలో అధికారులు, సిబ్బంది లంచం అడిగితే తమకు నేరుగా ఫిర్యాదు చేయాలని నిర్మల్ మున్సిపల్చైర్పర్సన్అప్పాల కావ్య సూచించారు. స్థానిక సమస్యలపై అవగాహన లేకుండా ప్రత్యేక అధికారుల పాలనలో చేసిన టెండర్లు, తైబజార్పన్నును రద్దు చేశామని, త్వరలో క్షేత్రస్థాయిలో పరిశీలించి, కొత్తగా టెండర్లు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం వైస్‌చైర్‌పర్సన్ అప్పాల గణేశ్చక్రవర్తితో కలిసి మాట్లాడారు. ప్రజల సహకారంతో నిర్మల్ పట్టణాన్ని ప్రణాళికాబద్ధంగా అ భివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. రోడ్లు, ఫుట్ పాత్‌లు, చౌరస్తాల్లో ఇష్టారీతిన ఏర్పాటు చేసిన వీధి వ్యాపారాలు, తోపుడుబండ్ల పై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
వారి కోసం ప్రత్యేకంగా వెండింగ్ జోన్లను ఏర్పాటు చేస్తామన్నారు. కోతుల సమస్య పరిష్కారానికి వారం రోజుల్లో చర్యలను ప్రారంభిస్తామని తెలిపారు. నిధులను కేటాయించాలని కోరుతూ త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామన్నారు. జిల్లా కేంద్రంలోని పాతబస్తీలో గల జౌళి నాలా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. ముంపు ప్రాంతాల్లో శాశ్వత పనులు చేపడుతామని పేర్కొన్నారు. డివైడర్ల మధ్యలో ఉన్న కోనోకార్పస్ మొక్కలను తొలగించి, సైకస్ జాతికి చెందిన మొక్కలను నాటుతామన్నారు.
