క్రేజీ ఆఫర్ మిస్ చేసుకున్న దీపికా పదుకొణె

క్రేజీ ఆఫర్ మిస్ చేసుకున్న దీపికా పదుకొణె

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌‌‌‌ దీపికా పదుకొణె వరుసగా భారీ ఆఫర్లను వదులుకోవడం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే రెండు పాన్‌‌‌‌ ఇండియా ప్రాజెక్ట్‌‌‌‌ల నుంచి తప్పుకున్న ఆమె.. ఈసారి హాలీవుడ్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ నుంచి కూడా వదులుకున్నట్టు సమాచారం. ‘ద వైట్‌‌‌‌ లోటస్‌‌‌‌’ అనే హాలీవుడ్‌‌‌‌ వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌ నాలుగో సీజన్‌‌‌‌లో కీలకపాత్రకు దీపికను సంప్రదించిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్ట్‌‌‌‌కు సంబంధించిన నిబంధనలు పాటించకపోవడంతో ఈ క్రేజీ ఆఫర్ ఆమెకు దక్కలేదని టాక్. 

 హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్‌లు తమ నటీనటుల ఎంపిక కోసం కచ్చితంగా ఆడిషన్స్ నిర్వహిస్తుంటాయి.  ఎంతటి పెద్ద స్టార్ అయినా ఆడిషన్స్‌‌‌‌ కంపల్సరీ. అయితే ఆడిషన్‌‌‌‌ ఇచ్చేందుకు దీపిక ఆసక్తి చూపకపోవడంతో ఈ అవకాశం చేజారిందని తెలుస్తోంది. గతంలో ప్రెగ్నెంట్‌‌‌‌ అవడం వల్ల థర్డ్ సీజన్‌‌‌‌ అవకాశం చేజార్చుకున్న దీపిక.. ఈసారి ఆడిషన్స్‌‌‌‌ ఇవ్వని  కారణంగా ఈ అవకాశాన్ని కోల్పోయింది. ఇక ప్రభాస్‌‌‌‌ హీరోగా సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్న  ‘స్పిరిట్‌‌‌‌’తో పాటు   నాగ్అశ్విన్‌‌‌‌ రూపొందిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌‌‌‌ నుంచి ఆమె తప్పుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్‌‌‌‌తో అట్లీ తీస్తున్న సినిమాతో పాటు షారుఖ్ ఖాన్ ‘కింగ్‌‌‌‌’ సినిమాలో దీపిక నటిస్తోంది.