బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. నందకిషోర్ రాజీనామా

 బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. నందకిషోర్ రాజీనామా

గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది.  ఆ పార్టీ గోషామహల్ ఇన్ చార్జ్ నందకిషోర్ వ్యాస్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ కి, తెలంగాణ భవన్ కి ప్యాక్స్ లో పంపించారు.   ఇకపై పార్టీలో పని చేయలేనని, పార్టీలోని తన పోస్టుకి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖలో తెలిపారు.  

2024 మార్చి 16వ తేదీన గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ ఆధ్వర్యంలో,  సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు  నందకిషోర్.  సీఎం రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేస్తున్న కృషికి ఆకర్షితుడినై తాను కాంగ్రెస్ లో  చేరుతున్నట్లుగా నందకిషోర్ వెల్లడించారు.  

గోషామహల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు.   కాగా నందకిషోర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఓటమి చవిచూశారు.