
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. మోస్ట్ అవైటెడ్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ NBK 108 మూవీకి టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి భగవంత్ కేసరి(Bhagavanth Kesari) అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఇందులో భాగంగా మూవీ నుండి మరో కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్లో బాలయ్య కత్తిని భూమిలోకి దించి చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఈ లుక్ చుసిన నందమూరి ఫ్యాన్స్ లుక్ కేక అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక ఈ మూవీతో బాలయ్య మరో మాస్ హిట్ ను తన ఖాతాలో వేసుకోబోతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జూన్ 10 బాలయ్య పుట్టినరోజుకు రెండు రోజుల ముందే వచ్చన ఈ అప్డేట్ తో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
భగవంత్ కేసరి'లో బాలకృష్ణ జంటగా కాజల్ అగర్వాల్(Kajal Agarwal) నటిస్తున్నారు. యంగ్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) కూడా ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి ఈసినిమాను నిర్మిస్తున్నారు. తమన్(Thaman) సంగీతం అందిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.