నూట ఎనిమిదో సినిమాని స్టార్ట్ చేయడానికి రెడీ

నూట ఎనిమిదో సినిమాని స్టార్ట్ చేయడానికి రెడీ

‘అఖండ’ విజయం తర్వాత బాలకృష్ణ కెరీర్ మరింత స్పీడందుకుంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో మూవీని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. త్వరలోనే అనిల్ రావిపూడితో తన నూట ఎనిమిదో సినిమాని స్టార్ట్ చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని నిన్న అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించనున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందించనున్నాడు. త్వరలోనే షూటింగ్ మొదలు కాబోతోందని చెబుతూ ఓ స్పెషల్ వీడియోని వదిలారు. దీనికి తమన్ ఇచ్చిన బీజీఎం ఓ రేంజ్‌లో ఉండటం చూస్తే.. ‘అఖండ’ని మించి మ్యూజిక్ ఇవ్వడానికి రెడీ అయ్యాడనిపిస్తోంది.

మాస్‌ పల్స్ తెలిసిన దర్శకుడు అనిల్ రావిపూడి.. బాలయ్య కోసం ఓ అదిరిపోయే స్క్రిప్ట్ రెడీ చేశారని టీమ్ చెబుతోంది. ఇంతవరకు ఎప్పుడూ చూడని విధంగా బాలకృష్ణ క్యారెక్టర్‌‌ని డిజైన్ చేశారంటూ ఊరిస్తోంది. ‘పెళ్లిసందడి’ ఫేమ్ శ్రీలీల బాలయ్యకి కూతురిగా కనిపించబోతోంది. ఓ హత్య కేసులో బాలయ్య జైలుకు వెళ్తారని, పద్నాలుగేళ్ల తర్వాత విడుదలైన ఆయనకి, కూతురికి మధ్య నడిచే కథ అని చెప్పుకుంటున్నారు. ‘ఐ డోన్ట్ కేర్’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వీటిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.