
మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత, నాందేడ్ సిట్టింగ్ ఎంపీ వసంతరావు చవాన్ (69) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన.. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఇవాళ (సోమవారం) మృతి చెందారు. వసంతరావు చవాన్ మృతదేహాన్ని ఆయన స్వస్థలానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు నైగావ్‌లో చవాన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎంపీ చవాన్ మృతి పట్ల మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ నానా పటోల్ సంతాపం వ్యక్తం చేశారు.