Nani 33: 80 దశకంలో ఊరమాస్ లీడర్.. ఈసారి దసరాను మించేలా!

Nani 33: 80 దశకంలో ఊరమాస్ లీడర్.. ఈసారి దసరాను మించేలా!

నేచురల్ స్టార్ నాని(Nani) కెరీర్ లో స్పెషల్ మూవీ అంటే దసరా(Dasara) అనే చెప్పాలి. తెలంగాణ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రా అండ్ రస్టిక్ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. కొత్త దర్శకుడు శీకాంత్ ఓదెల(Srikanth odela) తెరకెక్కించిన ఈ సినిమాలో ధరణి పాత్రలో నాని నటన సినిమాకె హైలెట్ అని చెప్పాలి. ఇంతకు ముందు ఎన్నడూ కనిపించని ఊరమాస్ అవతారంలో రచ్చ రచ్చ చేశాడు నాని. బొగ్గు గనుల్లో పనిచేసే యువకుడిగా తెలంగాణ యాసలో నాని డైలాగ్స్ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాయి.

ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబో తెరపైకి రానుంది. ఇటీవల నాని పుట్టినరోజు సందర్బంగా అధికారిక ప్రకటన ఇస్తూ నాని లుక్ కూడా రివీల్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో కూడా మరోసారి మాస్ అవతార్ లో దర్శనమిచ్చాడు నాని. నోట్లో బీడీతో, గుబురు గడ్డంతో స్టైలీష్ అండ్ మాసీగా ఉంది ఈ లుక్. దీంతో ఆ పోస్టర్ కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

అయితే.. తాజాగా ఈ సినిమా కథ గురించి ఒక న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమా కోసం మరోసారి తెలంగాణ బ్యాక్డ్రాప్ నే తీసుకున్నాడట దర్శకుడు శ్రీకాంత్. 80 దశకంలో తెలంగాణలోని వ్యవస్థ, ఆ వ్యవస్థపై తిరుగుబాటు చేసిన ఓ యువకుడు లీడర్ గా ఎలా ఎదిగాడు అనే కథతో  ఈ సినిమా రానుందని సమాచారం. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.