
- ఘనంగా యూజెనిక్స్ ఫిల్మ్‌ఫేర్, స్టైల్ అవార్డ్స్ తొలి ఎడిషన్
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌లో జరిగిన యూజెనిక్స్ ఫిల్మ్‌ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ సౌత్–2025 తొలి ఎడిషన్‌లో పలువురు సినీ తారలు వివిధ అవార్డులు గెలుచుకున్నారు. నాని ‘మ్యాన్ ఆఫ్ స్టైల్ అండ్ సబ్‌స్టాన్స్’, ‘హాటెస్ట్ స్టార్ (మేల్)’, రాశీ ఖన్నా ‘మోస్ట్ గ్లామరస్యూత్ ఐకాన్ (ఫిమేల్)’, ‘స్టైల్ ఐకాన్ (ఫిమేల్)’, అడివి శేషు ‘హాట్ స్టెప్పర్ (మేల్)’, మాళవిక మోహనన్ ‘హాట్‌స్టెప్పర్ (ఫిమేల్)’, ‘హాటెస్ట్ స్టార్ (ఫిమేల్)’ అవార్డులు అందుకున్నారు. సిద్ధార్థ్, అదితి రావ్ హైదరి ‘మోస్ట్ ఫ్యాషనబుల్ స్టార్ కపుల్’గా ఎంపిక కాగా, సిద్ధార్థ్ ‘ఫ్యాషన్ ఫార్వర్డ్ స్టార్’, అదితి ‘ఉమెన్ ఆఫ్ స్టైల్ అండ్ సబ్‌స్టాన్స్’ అవార్డులు గెలుచుకున్నారు.
ప్రగ్యా జైస్వాల్ ‘ఫిట్ అండ్ ఫ్యాబులస్ (ఫిమేల్)’, మంచు లక్ష్మి ‘ఫ్యాషన్ రిస్క్ టేకర్’, సందీప్ కిషన్, భాగ్యశ్రీ బోర్సే ‘రెడ్ కార్పెట్ లుక్’, భాగ్యశ్రీ ‘ఎమర్జింగ్ ఫేస్ ఆఫ్ ఫ్యాషన్ (ఫిమేల్)’, తేజ సజ్జా ‘ఎమర్జింగ్ ఫేస్ ఆఫ్ ఫ్యాషన్ (మేల్)’, సుధీర్ బాబు ‘మోస్ట్ గ్లామరస్ స్టార్’, అనిల్ రావిపూడి ‘మోస్ట్ స్టైలిష్ డైరెక్టర్’, నాగ వంశీ ‘మోస్ట్ స్టైలిష్ మూవీ మొగల్’, చిన్మయి శ్రీపాద ‘అల్టిమేట్ దివా సింగర్’, దేవి శ్రీ ప్రసాద్ ‘అల్టిమేట్ మ్యూజిషియన్’, అల్లు శిరీష్ ‘డేర్ టు బీ డిఫరెంట్’, సాయి ధరమ్ తేజ్ ‘మోస్ట్ డిజైరబుల్ స్టార్ (మేల్)’, విజయ్ దేవరకొండ ‘మోస్ట్ గ్లామరస్ యూత్ ఐకాన్ (మేల్)’, ‘మోస్ట్ ఫ్యాషనబుల్ స్టార్’, అల్లు అర్జున్ ‘మోస్ట్ స్టైలిష్ ఐకాన్ అండ్ స్టార్ (మేల్)’, ‘ట్రెండ్‌సెట్టర్’, నవీన్ పొలిశెట్టి ‘ఫిట్ అండ్ ఫ్యాబులస్ (మేల్)’ అవార్డులు సొంతం చేసుకున్నారు.