సోదాపు లేదా దమ్ముంటే నన్నాపు!

సోదాపు లేదా దమ్ముంటే నన్నాపు!

నాని, సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వి’. నివేద థామస్, అదితీ రావ్ హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుధీర్ ‌పోలీసాఫీసరుగా నటిస్తున్న ఈ మూవీలో నాని నెగిటివ్ రోల్ చేస్తున్నాడనే వార్త భారీ అంచనాలను ఏర్పరచింది. వాటిని సినిమా తప్పకుండా అందుకుంటుందనే నమ్మకాన్ని కలిగించింది సోమవారం విడుదలైన టీజర్. డైలాగులు, యాక్షన్ సన్నివేశాలు ఆద్యంతం కట్టిపడేశాయి. సుధీర్ బాబు యంగ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ట్రిమ్‌‌గా కనిపిస్తుంటే.. నాని నెగిటివ్‌‌ రోల్‌‌లో రగ్డ్‌‌గా కనిపిస్తున్నాడు. ‘ఫూల్స్ మాత్రమే రూల్స్ గుడ్డిగా ఫాలో అవుతారు. నేను అప్పుడప్పుడూ వాటిని బ్రేక్ చేస్తాను’ అంటూ సుధీర్ బాబు చెప్పే డైలాగ్‌‌తో టీజర్ ప్రారంభమయ్యింది. స్లోగా మొదలై యాక్షన్ మోడ్‌‌లోకి మారిపోయింది.
ఆధారాలు లేకుండా సూపర్ క్లీన్ జాబ్ చేసే హై ఎండ్ కిల్లర్‌‌గా నాని కనిపిస్తున్నాడు. ‘నువ్వొక సైకోవి’ అని నివేద అంటే.. ‘అమ్మో నిజమా.. నాకు భయమేస్తోంది’ అంటూ నాని సెటైర్​ వేసిన తీరు సూపర్బ్. ‘న్యాయాన్ని , ధర్మాన్ని కాపాడటానికి నువ్వు వస్తున్నావనగానే విజిల్స్ వేయడానికి నేనేమీ నీ ఫ్యాన్‌ని కాదురా’ అంటూ సుధీర్‌‌ని చాలెంజ్‌‌ చేయడం, ‘దిస్‌
గయ్‌ హేట్స్‌‌ మీ’ అంటూ సుధీర్‌ ఆ సవాలును ఎదుర్కోవడానికి రెడీ అవడం వంటివి సూపర్‌ హైప్‌ను క్రియేట్ చేసేలా ఉన్నాయి. ఇక చివర్లో ‘సోదాపు.. దమ్ముంటే నన్నాపు’ అనే నాని డైలాగ్‌ అంచనాల్ని పెంచేసింది. నాని లుక్, వాయిస్ మాడ్యులేషన్ హైలైట్. అమిత్‌‌ త్రివేది మ్యూజిక్‌ అందిస్తున్నఈ చిత్రాన్ని దిల్‌ రాజు, శిరీష్, హర్షిత్‌‌ రెడ్డి నిర్మిస్తున్నారు. జగపతిబాబు, అవసరాల శ్రీనివాస్‌ , వెన్నెల కిషోర్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మార్చి 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.