ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పీఏ శివను కఠినంగా శిక్షించాలె : కాంగ్రెస్ నేతలు

ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పీఏ శివను కఠినంగా శిక్షించాలె : కాంగ్రెస్ నేతలు

వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పీఏ శివను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో మాజీమంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఎంజీఎం చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులతో బైఠాయించి నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ను బర్తరఫ్ చేయాలనీ డిమాండ్ చేశారు. 

అధికార టీఆర్ఎస్​పార్టీకి చెందిన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్  ప్రైవేట్ పీఏ శివపై పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది.  సిద్దిపేట జిల్లాకు చెందిన దళిత యువతి హన్మకొండ బాలసముద్రం ప్రాంతంలోని ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఐదు సంవత్సరాల లా కోర్స్ చదువుతోంది. మూడు రోజుల క్రితం హాస్టల్ వార్డెన్  వేముల శోభ ఒక విషయమై మాట్లాడే పని ఉందంటూ.. యువతిని అలంకార్ ప్రాంతంలోని తన నివాసానికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో హనుమకొండ చౌరస్తాలో మెడికల్ షాప్ నిర్వహించే సదరు మహిళ బంధువు కోట విజయ్,  ఎమ్మెల్యే నరేందర్ పీఏ వేముల శివ ఆ ఇంటికి వచ్చారు. అక్కడే ఆ యువతి పై వారిద్దరూ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.