హాసన్ పర్తి/ కల్లూరు, వెలుగు : ప్రజలు రోడ్లపై చెత్త వేయకుండా చర్యలు తీసుకొని నగరంలో సమగ్ర శానిటేషన్ నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని హనుమకొండ కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు.
ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం గ్రేటర్ వరంగల్ పరిధిలోని హసన్పర్తిలో కలెక్టర్ ఆకస్మికంగా శానిటేషన్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య పనుల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిధిలోని చెన్నూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ సందర్శించి, వైద్య సేవలపై ఆరా తీశారు.
