భీమారం ఎస్వీఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్సిట్యూషన్లో సందడిగా టెక్ స్ప్రింగ్ ఫెస్ట్ 

భీమారం ఎస్వీఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్సిట్యూషన్లో సందడిగా టెక్ స్ప్రింగ్ ఫెస్ట్ 

హసన్ పర్తి, వెలుగు : హనుమకొండ జిల్లా భీమారం ఎస్వీఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్సిట్యూషన్​లో “టెక్ స్ప్రింగ్ ఫెస్ట్ - 2026” వేడుకలు సోమవారం విజయవంతంగా ముగిశాయి. మూడు రోజులపాటు ఈ  ఈవెంట్​లో మొత్తం 56 సాంకేతిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇన్సిట్యూషన్స్ చైర్మన్ డా.ఈ.తిరుమలరావు మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభ, సృజనాత్మకత, క్రమశిక్షణను అభినందించారు. అనంతరం స్టూండెంట్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రతిమ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డా.బోనపల్లి ప్రతీక్, వైస్ చైర్పర్సన్ ఎర్రబెల్లి సువర్ణ, డా.ఎర్రబెల్లి హర్షిణి తదితరులు పాల్గొన్నారు.