లోకేశ్ ట్వీట్ : సైబర్ క్రైమ్ పుట్టిందే జగన్ ఇంట్లో

లోకేశ్ ట్వీట్ : సైబర్ క్రైమ్ పుట్టిందే జగన్ ఇంట్లో

సైబర్ క్రైమ్ పుట్టిందే జగన్ ఇంట్లో అన్నారు ఏపీ మంత్రి నారా లోకేశ్. సీఎం చంద్రబాబు సైబర్‌ క్రైమ్‌ కు పాల్పడ్డారంటూ వైసీపీ అధినేత జగన్‌ గవర్నర్‌ కు ఫిర్యాదు చేసిన క్రమంలో.. లోకేశ్‌ స్పందించారు. “2001లో ఇంటర్నేషనల్‌ కాల్స్‌ స్కామ్‌ మరిచిపోయారా? జగన్‌ ను  ప్రశ్నించారు. ట్విటర్‌ వేదికగా లోకేశ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘సైబర్‌ క్రైమ్‌కు కేరాఫ్‌ అడ్రస్‌ జగన్‌. సైబర్‌ క్రైమ్‌ చేయడం మాత్రమే జగన్‌ కు తెలుసు.

పదో తరగతి పరీక్ష్లోల పరిక్ష పత్రాలు ఎత్తుకెళ్లింది నువ్వే. లక్షల కోట్ల ప్రజాధనం లూటీ చేసిందీ నువ్వే. TDP సమాచారం చోరీ చేసిందీ నువ్వే. నేరాలు, ఘోరాలు, చోరీల్లో నీ ర్యాంకు A1. బ్రదర్‌ అనిల్‌ వీఎస్‌ఎన్‌ఎల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ కు కన్నం వేసి రూ.60 కోట్లు కొట్టేశాడు. ఆ తర్వాత మీ కుంభకోణాల స్థాయి పెరిగి లక్షల కోట్లకు పెరిగింది.’’ అని ట్విటర్‌ ట్వీట్ చేశారు లోకేశ్.