
TDP కార్యకర్తలకు అండగా నిలిచేందుకు గుంటూరు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పామని తెలిపారు నారా లోకేష్. YCP వర్గీయులు చేసే దాడులు, బెదిరింపులకు సంబంధించిన సమాచారాన్ని, టీడీపీ ప్రత్యేక విభాగం నెంబర్ 7306299999కి ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. పార్టీపరంగా కార్యకర్తలకు, నాయకులకు అన్నివిధాలా సహాయం అందిస్తామన్నారు. 40రోజుల్లో వంద చోట్ల పైగా దాడులు, దౌర్జన్యాలు చేయడం.. ఆరుగురిని అత్యంత దారుణంగా చంపేయడం కిరాతకం అన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకే ఈ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు లోకేష్.
వారెంత కవ్వింపు చర్యలకు దిగినా టిడిపి కార్యకర్తలు సంయమనం పాటిస్తున్నారన్న లోకేష్.. అధికారం అండతో వైసీపీ వర్గీయులు రెచ్చిపోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎక్కడ దాడులు జరిగినా, దౌర్జన్యాలకు పాల్పడినా తక్షణమే పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేకవిభాగం నెంబర్ 7306299999కి ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. చట్టపరమైన, న్యాయపరమైన సహాయం ఆయా కుటుంబాలకు పార్టీ తరఫున అందజేస్తామని భరోసా ఇచ్చారు నారా లోకేష్.