
మంగళగిరి: రాష్ట్రంలో పోలీసులు రాజ్యమేలుతున్నారన్నారు టీడీపీ నేత నారా లోకేష్. అన్యాయంగా తెలుగుదేశం కార్యకర్తలను పథకం ప్రకారమే అరెస్టు చేస్తున్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే తమ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారో వాళ్లందరి పై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
కులాలను మతాలను అడ్డంపెట్టుకొని జగన్ మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నారని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పైన కూడా కుల రంగు వేయడం దారుణమన్నారు. ప్రజల ప్రాణాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి లెక్క లేదని, భయంకరమైన కరోనా వ్యాధి గురించి కూడా తేలిగ్గా మాట్లాడుతున్నారన్నారు.