సిల్లీ కేసులతో చంద్రబాబు గడ్డం మీద వెంట్రుక కూడా పీకలేరు

V6 Velugu Posted on Mar 16, 2021

సిల్లీ కేసులతో చంద్రబాబు గడ్డం మీద మెరిసిన వెంట్రుక కూడా పీకలేరని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. అమరావతిని అంతం చేయడానికి జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా.. దైవభూమి తనని తానే కాపాడుకుంటుందని లోకేష్ అన్నారు. ‘తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని నమ్మించడానికి జగన్ రెడ్డి పడుతున్న తిప్పలు చూస్తుంటే నవ్వొస్తుంది. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనే అంశమే లేదంటూ కోర్టు అనేక సార్లు చీవాట్లు పెట్టినా పాత పాటే ఎన్నాళ్లు? 21 నెలలు శోధించి అలసిపోయి ఆఖరికి రెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టే పరిస్థితికి దిగజారారు’ అని లోకేష్ వైసీపీ నాయకులపై మండిపడ్డారు.

Tagged andhrapradesh, Nara Lokesh, chandrababu naidu, Amaravathi, YS JAGAN

Latest Videos

Subscribe Now

More News