పీఆర్టీయూ క్రమశిక్షణా సంఘం చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నరసింహారెడ్డి

పీఆర్టీయూ క్రమశిక్షణా సంఘం చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నరసింహారెడ్డి

హైదరాబాద్, వెలుగు: ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (పీఆర్టీయూటీజీ) రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కోమటిరెడ్డి నరసింహారెడ్డి నియమితులయ్యారు. గురువారం పీఆర్టీయూ స్టేట్ ఆఫీసులో టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ఆయనకు నియామక పత్రాన్ని అందించారు.

ఆ వెంటనే నరసింహారెడ్డి బాధ్యతలు కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ  శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ..  క్రమశిక్షణతో సంఘం నడవాలని, చైర్మన్ బాధ్యతలను ఆదర్శంగా నిర్వహించాలని నరసింహా రెడ్డికి సూచించారు.  కాగా, నర్సింహారెడ్డిని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండు లక్ష్మణ్, పుల్గం దామోదర్ రెడ్డి తదితరులు అభినందించారు.