అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పింక్ ప్రామిస్ మ్యాచ్ లో.. రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ లోని రాజస్థాన్ లోని స్వామి మాన్ సింగ్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ విజయపరంపరకు చెక్ పెట్టాలని రాజస్థాన్ చూస్తోంది. అందులో భాగంగా తమ పవర్ ప్యాక్ బ్యాటర్స్ ను సిద్ధం చేసింది. చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీని ఇంపాక్ట్ ప్లేయర్ గా దింపుతోంది.
ఇక మూడు మ్యాచులు గెలిచిన ఊపులో రాజస్థాన్ లో గెలవాలనే కసితో గుజరాత్ ఉంది. మానవ్ సుతార్ ప్లేస్ లో ప్రిసద్ధ్ కృష్ణను ఆడిస్తున్నారు. ఇవాళ్టి మ్యాచ్ లో రియాన్ పరాగ్ ఆడటం లేదు. జైస్వాల్ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
పిచ్:
పిచ్ సెకండ్ హాఫ్ లో స్లో గా మారనుందని క్యూరేటర్లు చెబుతున్నారు. దీంతో టాస్ గెలిచిన ఆర్ఆర్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ స్టేడియంలో ఇప్పటివరకు 9 మ్యాచ్ లు జరగగా.. 6 ఛేజింగ్ విన్నింగ్ లే ఉన్నాయి. అందుకే రాజస్థాన్ ఛేజింగ్ తీసుకుంది. ఆర్ఆర్ ప్లాన్ ను గుజరాత్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఎంత టార్గెట్ ఇచ్చినా.. దూకుడుగా ఆడేందుకు ఆర్ ఆర్ లో యువ బ్యాటర్లు రెడీ ఉన్నారు.
టీమ్స్ వివరాలు:
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభ్‌మన్ గిల్(సి), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(w), నిషాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్(c), ధ్రువ్ జురెల్(w), షిమ్రోన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, శుభమ్ దూబే, దాసున్ షనక, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా
ఇంపాక్ట్ సబ్స్ :
గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ సబ్స్: ప్రసిద్ధ్ కృష్ణ, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కుమార్ కుశాగ్రా
రాజస్థాన్ రాయల్స్ ఇంపాక్ట్ సబ్‌లు: వైభవ్ సూర్యవంశీ, ఆడమ్ మిల్నే, రవి సింగ్, సుశాంత్ మిశ్రా, రవి బిష్ణోయ్
